Ministry | రాష్ట్రపతి పాలన ఎత్తివేత…

Ministry | రాష్ట్రపతి పాలన ఎత్తివేత…

Ministry | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్లు గెజిట్ విడుదల చేసింది. చిన్న రాష్ట్రమైన మణిపూర్‌లో 2023 మే 3న మైత్రి, కుకీ అనే రెండు తెగల మధ్య భూమి, పలుకుబడి విషయంలో నెలకొన్న వివాదం జాతుల మధ్య హింసకు దారితీసి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హింసను అరికట్టడంలో అనాటి ముఖ్యమంత్రిగా ఉన్న బీరెన్ సింగ్ విఫలం కావడంతో తొలిసారిగా ఆ రాష్ట్రంలో 2025 ఫిబ్రవరి 13న ఆరునెలల పాటు రాష్ట్రపతి పాలన విధించారు.

ఆ తర్వాత ఘర్షణలు తగ్గకపోవడంతో 2025 ఆగస్టులో మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలనను పొడిగించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాలనను ముగించాలని కేంద్రం భావించింది. 2026 ఫిబ్రవరి 3న మణిపూర్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ నేతలు యుమునాం ఖేంచంద్ ను సీఎంగా ఎనుకున్నారు. దీంతో రాష్ట్రపతి పాలనను రద్దు చేసినట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది.

Ministry |

Leave a Reply