నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపిన నేతలు
నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపిన నేతలు
- ప్రజా సమస్యలను రాజ్యసభలో సమర్థంగా ప్రస్తావిస్తామని హామీ
అమరావతి, ఆంధ్రప్రభ : ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన తెలుగుదేశం పార్టీ నేతలు చింతకాయల విజయ్, సానా సతీష్, భాష్యం రామకృష్ణ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులుగా తమకు అవకాశం కల్పించి, పార్టీ తరఫున దేశ అత్యున్నత సభలో ప్రాతినిధ్యం వహించే బాధ్యత అప్పగించినందుకు లోకేష్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సమస్యలను రాజ్యసభలో సమర్థంగా ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు.
నూతన సభ్యులకు నారా లోకేష్ అభినందనలు తెలియజేసి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ అంశాలను జాతీయ స్థాయిలో బలంగా వినిపించాలని ఆకాంక్షించారు.
ఈ భేటీ సందర్భంగా పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు కూడా హాజరై నూతన రాజ్యసభ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రజాసేవలో మరింత చురుకుగా పనిచేస్తామని సభ్యులు పేర్కొన్నారు.
