AP | ఆదివారం నాడూ రేష‌న్ షాప్స్ ఓపెన్ : మంత్రి నాదెండ్ల మనోహర్

వెల్ల‌డించిన మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ వెల్ల‌డి
ప్ర‌తి నెల 15 వ తేది వ‌ర‌కు రేష‌న్ పంపిణీ
సీనియ‌ర్ సిటిజెన్స్, విక‌లాంగుల‌కు ఇంటికే నిత్యావ‌స‌రాలు

విజ‌యవాడ – జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారానే నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్న తరుణంలో, లబ్ధిదారుల సౌకర్యార్థం ఎపి ప్ర‌భుత్వం మరో ముందడుగు వేసింది. ఇకపై ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, ఆదివారాల్లోనూ రేషన్ దుకాణాలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

విజయవాడలో రేషన్ షాపు ద్వారా సరుకుల పంపిణీ ట్రయల్ రన్‌ను నేడు ప‌రిశీలించారు.. పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, . గతంలో రేషన్ వాహనాల కోసం పనులు మానుకుని గంటల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి ఉండేదని, ఆ ఇబ్బందులను తొలగించడమే కాకుండా, లబ్ధిదారులకు మరింత వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

“ప్రజల సౌలభ్యమే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత. జూన్ 1 నుంచి 15 రోజుల పాటు రేషన్ సరుకులు పంపిణీ చేస్తాం. ఈ పదిహేను రోజుల్లో ఆదివారంతో సహా అన్ని రోజులూ షాపులు తెరిచే ఉంటాయి. దీనివల్ల రోజువారీ పనులకు వెళ్లేవారు, కూలీలు, ప్రైవేటు ఉద్యోగులు తమకు వీలైన సమయంలో, ముఖ్యంగా సెలవు దినమైన ఆదివారం కూడా రేషన్ తీసుకునేందుకు అవకాశం కలుగుతుంది” అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

Leave a Reply