మంత్రి వాకిటి శ్రీహరి సింప్లిసిటీ..

మంత్రి వాకిటి శ్రీహరి సింప్లిసిటీ..

  • కార్యకర్తలతో కలిసి రోడ్డు పక్క హోటల్లో టిఫిన్ చేసిన మంత్రి

మక్తల్, ఆంధ్రప్రభ : నేటి సమాజంలో మామూలు పంచాయతీ వార్డు మెంబర్ గా గెలిచిన వ్యక్తి కూడా తన దర్పాన్ని ప్రదర్శించే ఈ రోజుల్లో రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పటికీ తన సింప్లిసిటీ మరోసారి చాటుకున్నారు రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి .ఇవాళ నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న హోటల్ దగ్గర ఆగి పార్టీ కార్యకర్తలతో కలిసి మంత్రి రోడ్డు పక్కనే టిఫిన్ చేశారు. రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న హోటల్ దగ్గర మంత్రి టిఫిన్ చేస్తూ కనిపించడంతో ఆ దారి గుండా వెళ్తున్న పలువురు అక్కడ ఆగి మంత్రితో కలిసి ముచ్చటించారు.

రాష్ట్ర మంత్రి ఇంత సాధారణంగా రోడ్డు పక్కన టిఫిన్ చేస్తున్నారే అంటూ మాట్లాడుకున్నారు. మంత్రిగా ఉన్న లేకున్నా ఎప్పుడు ఒకే స్టైల్ లో సాధారణ జీవితం గడపడమే తనకి ఇష్టం అంటూ ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. హోటల్ దగ్గర పార్టీ నాయకులు కార్యకర్తలను అందరిని అడిగి మరి టిఫిన్ చేయించారు. మంత్రితో పాటు టిఫిన్ చేసిన వారిలో మాజీ జడ్పిటిసి జి.లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా ,బి. గణేష్ కుమార్, బోయ రవికుమార్,చంద్రకాంచహత్ గౌడ్ , వాకిటి హనుమంతు, రంజిత్ రెడ్డి ,వల్లంపల్లి లక్ష్మణ్, కృష్ణయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.