చిట్యాలలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

చిట్యాలలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

చిట్యాల, ఆంధ్రప్రభ: దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబమని మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్ అన్నారు. శుక్రవారం చిట్యాల మండల కేంద్రంలోని కనకదుర్గ గుడి సెంటర్‌లో పురపాలక చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ దేశ సమగ్రత, ఐక్యత కోసం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర నిర్వహించారని తెలిపారు. ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టకుండా మన్మోహన్ సింగ్‌ను ప్రధాని చేశారని పేర్కొన్నారు.

ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ దేశ ఐక్యత కోసం పనిచేస్తున్నారని తెలిపారు. 2029లో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.