నల్లమల టైగర్ రిజర్వ్‌పై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆరా

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన నల్లమల్ల రిజర్వ్ ఫారెస్ట్ పై అచ్చంపేట అటవీ ప్రాంతంలోని పెద్దపులుల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ఏమంత కేశవ్ పార్టీ కలెక్టర్‌, జిల్లా అటవీ అధికారి రవిచంద్రతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం నల్లమల్లలో 44 పులులు, 164 చిరుతపులు, ఒక్క లక్ష జింకలు, ఉన్నాయని సీఎంకు జిల్లా ఫారెస్ట్ అధికారి వివరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల్ల టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలోని పెద్దపులుల సంరక్షణ, వాటి సంఖ్య, అటవీ శాఖ చేపడుతున్న పరిరక్షణ చర్యలపై వన్యప్రాణుల సంరక్షణ పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.

శనివారం ఊర్కొండపేట శ్రీ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ఆలయ దర్శనం తదితర కార్యక్రమాల నిమిత్తం జిల్లాకు నల్లమల్ల అటవీ ప్రాంతంలో పులులు, చిరుతపులులు వన్యప్రాణులు విషయాలపైజిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ నల్లమల్ల టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లలో నమోదైన పెద్దపులుల అరుదైన ఛాయాచిత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. ఆ ఫోటోలను ముఖ్యమంత్రి ఆసక్తిగా పరిశీలిస్తూ నల్లమల్ల అటవీ ప్రాంతంలోని జీవవైవిధ్యం, వన్యప్రాణుల సంరక్షణ చర్యల గురించి అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అదే విధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర నల్లమల్ల టైగర్ రిజర్వ్‌లో సంచరిస్తున్న పెద్దపులి చిత్రాన్ని అందజేశారు. నల్లమల్ల అటవీ ప్రాంత విశిష్టత, అక్కడి వన్యప్రాణుల సంపద, పెద్దపులుల సంరక్షణ కోసం అటవీ శాఖ చేపడుతున్న చర్యలను ఉప ముఖ్యమంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అచ్చంపేట డివిజన్ పరిధిలోని నల్లమల్ల టైగర్ రిజర్వ్‌లో ప్రస్తుతం ఎన్ని పెద్దపులులు ఉన్నాయో, వాటి సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారో, వేటగాళ్ల కదలికలను అరికట్టేందుకు ఎలాంటి నిఘా వ్యవస్థ అమల్లో ఉందో జిల్లా కలెక్టర్‌ను అటవీ శాఖ అధికారిని అడిగి తెలుసుకున్నారు. అలాగే పులుల సంచార ప్రాంతాలు, వాటి ఆహార లభ్యత, అటవీ విస్తీర్ణం, వన్యప్రాణుల రక్షణకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై కూడా వివరాలు తెలుసుకున్నారు.

దీనికి జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ముఖ్యమంత్రికి వివరిస్తూ, ప్రస్తుతం నల్లమల్ల టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో మొత్తం 44 పెద్దపులులు, 164 చిరుత పులుల ,1 లక్ష జింకలు, ఇతర వన్యప్రాణులు ఉన్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు అటవీ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కెమెరా ట్రాప్‌లు, ప్రత్యేక పహారా బృందాలు, డ్రోన్ నిఘా, ఫీల్డ్ సిబ్బంది ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపడుతోందని తెలిపారు. పులుల సంచారాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో నమోదు చేస్తూ వాటి సంరక్షణకు అవసరమైన చర్యలు నిరంతరం అమలు చేస్తున్నామని కలెక్టర్, అటవీ శాఖ అధికారి వివరించారు.

నల్లమల్ల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం అక్కడి అటవీ పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉందనడానికి నిదర్శనమని అధికారులు వివరించారు. పెద్దపులులతో పాటు చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి కుక్కలు, సాంబార్ జింకలు, చీతల్ జింకలు, అడవి పందులు, నెమళ్లు తదితర అనేక రకాల వన్యప్రాణులు ఈ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నాయని తెలిపారు.

నల్లమల్ల టైగర్ రిజర్వ్ జీవవైవిధ్య పరిరక్షణలో రాష్ట్రానికి అత్యంత కీలకమైన అటవీ ప్రాంతంగా గుర్తింపు పొందిందని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు. పులుల సంరక్షణతో పాటు అటవీ సంపదను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని, అటవీ శాఖ సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమిస్తూ వన్యప్రాణుల రక్షణకు కట్టుబడి పనిచేస్తున్నారని వివరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లమల్ల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇస్తుందని, పులుల సంఖ్యను పెంపొందించే దిశగా అవసరమైన అన్ని చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని అధికారులతో జరిగిన చర్చ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రంలోని అటవీ సంపదను భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, జీవవైవిధ్య పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.