అచ్చెన్న ఆగ్రహం..
ఆంధ్రప్రభ – కృష్ణా ప్రతినిధి : జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్దాల కోరు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు అన్నారు. మొంథా తుఫాన్ కారణంగా వరి పైరు నేలకొరిగిన నేపథ్యంలో జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం తాడిగడప, కంకిపాడు మండలం పునాదిపాడు, పామర్రు నియోజకవర్గం పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామాల్లో ఆయన పర్యటించారు.
వరి, పసుపు, కంద పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంటల భీమాపై వైసీపీ టెలీకాన్సరెన్స్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉందని, వాస్తవాలు మాట్లాడితే సమాధానం చెబుతాం. విమానం లేదని తుఫాను ప్రభావంతో ఐదు రోజులుగా కష్టపడుతున్న ప్రజలను, రైతులను పట్టించుకోని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు.
చుట్టం చూపుగా వచ్చే వక్తి మాటలకు ఏమనాలో అర్థం కావటం లేదన్నారు. రైతులు కష్టాలో ఉంటే గదిలో జగన్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పంటల భీమాపై జగన్ అబద్దాలు వల్లె వేస్తున్నారని, దమ్ము, ధైర్యం ఉంటే జగన్ టెలీకాన్ఫర్సె వ్యాఖ్యలపై చర్చకు రావాలని చాలెంట్ విసిరారు.
వాస్తవ నివేదికలతో తాము చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. తుఫాను ప్రభావంతో ఐదురోజులుగా రైతులు, ప్రజలు కష్టపడ తుంటే కేవలం బెంగుళూరు నుండి విమానం లేదనే సాకుతో రాష్ట్రానికి రాని వ్యక్తి జగన్ అన్నారు. ఇప్పుడు అసత్యాలు ప్రచారం చేస్తూ’ పబ్బం గడుపుకుంటున్నారన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ బీమా వాటా చెల్లించలేదని, సాక్ష్యాత్తు అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి బహిరంగంగా చెప్పారన్నారు. రైతులకు సంబంధించిన ప్రతీ విషంలో అసత్యాలు ప్రచారం చేస్తూ వైసీపీ నేతలు అబాసుపాలవుతున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరితోపాటుగా మిర్చి, పొగాకు, మామిడి రైతులకు సీఎం చంద్రబాబు అండగా నిలిచారన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో ఆ ఊసే లేదన్నారు. గత ఐదు సంవత్సరాలుగా కాలువల్లో పూడిక తీయటం చేతగాని, మాజీ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయటం తగదన్నారు. బుడమేరు వరదల్లో 15 రోజుల్లో నష్టపోయిన ప్రతీ ఒక్కరికీ న్యాయం చేశామని, 300 కోట్లు నష్టపోయిన వారి ఖాతాల్లో వేసిన ఘనత మాదే అన్నారు.
ఇంట్లో కూర్చుని మాట్లాడితే కుదరదని, బహిరంగ సమావేశం పెట్టు నేను కూడా వస్తా. లేదా అసెంబ్లీకి రా నీ ప్రశ్నలన్నిటికి సమాధానం చెబుతానన్నారు.
