30thApril | పెద్ది నమ్మకం నిజమయ్యేనా..? రామ్ చరణ్ మాస్ లుక్ అదిరింది..

30thApril | పెద్ది నమ్మకం నిజమయ్యేనా..? రామ్ చరణ్ మాస్ లుక్ అదిరింది
30thApril | మాస్ లుక్‌లో అదరగొట్టిన రామ్ చరణ్
పెద్ది కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
చికిరి పాట 200 మిలియన్స్ వ్యూస్
పాన్ ఇండియా స్థాయిలో పెద్ది విడుదల
చరణ్ కెరీర్‌లో మరో ప్రత్యేక చిత్రం
30thApril | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా స్పోర్ట్స్-యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. మార్చి 27న విడుదల చేయాలని భావించిన ఈ సినిమాను వాయిదా వేయనున్నట్టుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రచారంలో ఉన్న వార్తలను నిజం చేస్తూ మూవీ న్యూ రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇంతకీ.. పెద్ది వచ్చేది ఎప్పుడు..? పెద్ది నమ్మకం నిజమయ్యేనా..?
మాస్ లుక్ లో చరణ్..
పెద్ది సినిమాను రామ్ చరణ్ పుట్టిన రోజైన మార్చి 27న రిలీజ్ చేస్తామని ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే.. అనుకోని కారణాల వలన పెద్ది వాయిదాపడింది. ఇప్పుడు వేసవి సెలవుల్ని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. రిలీజ్ కి ఇప్పుడు ఎక్కువ టైమ్ దొరకడంతో మేకర్స్ భారీ స్థాయిలో ప్రమోషన్స్‌కు సిద్ధమవుతున్నారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో రామ్ చరణ్ మాస్ లుక్‌లో అదరగొట్టారు. పొడవైన జుట్టు, రగ్గడ్ గెడ్డం, నోస్ రింగ్‌తో ఆయన లుక్ ఇంటెన్స్ గా కనిపిస్తోంది. ఆయన పదునైన చూపు నేరుగా గుండెల్లోకి దూసుకెళ్తుంది. చుట్టూ అలసిపోయిన ముఖాల్లో వేదన కనిపించే జనసమూహం మధ్య నుంచి ఆయన రావడం ఆశాజనకం ఎమోషన్ ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది.

చికిరా పాట 200 మిలియన్స్..
ఈ చిత్రం ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్-లుక్ పోస్టర్లు, ఏ ఆర్ రెహమాన్ స్వరపరిచిన చార్ట్‌బస్టర్ సింగిల్ చికిరి చికిరి అన్ని ప్లాట్‌ఫామ్‌లలో అద్భుతమైన స్పందనను అందుకుంది. అనేక మైలురాళ్లను అధిగమించి, సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. చికిరి పాట 200 మిలియన్ల వ్యూస్ దాటింది. అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్ నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సరికొత్త చరణ్..
రామ్ చరణ్ ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రం పెద్ది అన్ని దక్షిణ భారత భాషలతో పాటు హిందీలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ మూవీ పై చరణ్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. మరి.. పెద్ది చరణ్ నమ్మకాన్ని నిజం చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందిస్తుందేమో చూడాలి. పెద్ది నమ్మకం నిజమయ్యేనా..?
