లౌకిక స్ఫూర్తికి ప్రతీక మొహరం……
పీర్ల జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే.. జీఎస్సార్…..
రేగొండ, ఆంధ్రప్రభ : త్యాగానికి ప్రతిరూపం మొహర్రం (పీర్ల పండుగ ) భిన్న మతాల ఐకమత్యమే తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండల కేంద్రంలో అత్యంత వైభంగా నిర్వహిస్తున్న మొహర్రం వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కుల మతల తేడా లేకుండా మత సామరస్యంతో జరుపుకునే పండుగనే మొహర్రం అని అన్నారు.
లౌకిక స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకల్లో భాగంగా శాంతి, సామరస్యాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. అసైదుల హారతి కాళ్ళ గజ్జెల గమ్మతి అంటూ తెలంగాణ సంస్కృతిని గుర్తుతెచ్చే పండుగని భక్తిశ్రద్దలతో అన్ని మతాల వారు కలిసికట్టుగా జరుపుకుంటారని తెలిపారు. రాచరిక వ్యవస్థ పునరుద్దనంగా భావించిన మహ్మద్ ప్రవక్త మనువడు హాజ్రత్ ఇమామ్ హుస్సేన్ ప్రజల్ని చైతన్యవంతులను చేసి ప్రతిఘటించడానికి సిద్దపడ్డారని ఈ సందర్బంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు. సూదనబోయిన ఓంప్రకాష్, మటికే సంతోష్,సాయిని ముత్యం, పాతపల్లి సంతోష్, వంచనగిరి వీరేశం, చిగురుమామిడి. కుమారస్వామి, పత్తి తిరుపతి, జోరు సుదర్శన్, సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షులు నాండ్రే సునీత- రవీందర్,ఓమాజీ, ప్రేమాజీ, వైనాల. ప్రభాకర్,ముస్లిం పెద్దలు. యండి. షఫీమహ్మద్, ఎండీ. అబ్దుల్ రహీమ్, అజారుద్దీన్, సలీం, ఆచారవంతులు దాసరి. చిన్ని, చిలుక. కిరణ్, దాసరి. చిన్ని, శ్రీరామోజు. రాజు, నిమ్మల రాజు, పుల్యాల. యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.
