క్వాటర్స్ లోని సమస్యలు తీర్చడమే నా లక్ష్యం..

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : భూపాలపల్లి మున్సిపాలిటీలోని 28వ వార్డులో ఉన్న మిలియన్ క్వార్టర్స్ లోని సమస్యలను పరిష్కరించడమే తన లక్ష్యమని కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన సిపిఐ పార్టీ అభ్యర్థి సొత్కు ప్రవీణ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం క్వార్టర్స్ లోని ఇంటింటికి తిరుగుతూ కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. మిలీనియం క్వార్టర్స్ లో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేలా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నానని తెలిపారు. వార్డు ప్రజలు తనని ఆదరించి గెలిపించాలని వేడుకున్నాడు. ఈ ప్రచారంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు , ఐ ఎన్ టి యూ సి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply