బల్లిపర్రులో కొత్త సౌకర్యం..

బల్లిపర్రులో కొత్త సౌకర్యం..
పెడన, ఆంధ్రప్రభ : పెడన మండలం బల్లిపర్రు గ్రామంలో సీఎస్‌ఆర్ నిధులతో రూ.15 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 0.5 ఎంఎల్‌డీ మైక్రో ఫిల్టర్‌ను మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు.
గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ మైక్రో ఫిల్టర్‌ను ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
