ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రత్యేక ప్రార్థనలు

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సతీమణి డాక్టర్ సబిత ఆనంద్, కుమారుడు వైభవ్ ఆనంద్‌తో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

రాబోయే రోజుల్లో వికారాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Leave a Reply