వడదెబ్బతో ఉపాధి హామి కూలి మృతి

జన్నారం, ఆంధ్రప్రభ : జన్నారం గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలి యాట ఇందయ్య(60) వడదెబ్బతొ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు.ఇందయ్య గత రెండు రోజుల క్రితం ఉపాధి పనులు చేస్తుండగా వడదెబ్బ తగిలి స్పృహ పోయాడని వెంటనే జన్నారంలోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా ప్రథమ చికిత్స చేసిన తరువాత మెరుగైన వైద్యం కోసం జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ అతను సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇందయ్యకు భార్య దుబ్బరాజు,కుమారులు గంగాధర్,జగన్ ఉన్నారు. ఆ ఇద్దరికీ పెండ్లి అయింది.మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిరుపేదైన మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆ గ్రామ సర్పంచి అజ్మీర కళావతి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందునాయక్ కోరారు.
