Lenin Movie | ‘లెనిన్’ విజయాన్ని ఆకాంక్షిస్తూ పూజలు
నాగార్జున, అమల, అఖిల్‌తో పాటు చిత్ర బృందం తిరుమలలో ప్రత్యేక పూజలు
జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘లెనిన్’ చిత్రానికి స్వామివారి ఆశీస్సులు
Lenin Movie | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ అక్కినేని కుటుంబ సభ్యులు సోమవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. నటుడు అక్కినేని నాగార్జున, అమల, అఖిల్ అక్కినేనితో పాటు చిత్ర బృందం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన ‘లెనిన్’ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు చిత్రం ఘన విజయం సాధించాలని కోరుతూ చిత్రబృందం శ్రీవారి ఆశీస్సులు తీసుకుంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ వేడుక ఇటీవల తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్‌లో అభిమానుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు.


