Meeting | తైవాన్ అంశంపై చైనా అధ్యక్షుడి హెచ్చరిక

Meeting | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనలో భాగంగా బీజింగ్‌లోని ‘గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్’లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ను కలిశారు. ఇరుదేశాల మధ్య కీలక ద్వైపాక్షిక అంశాలపై ఈ సందర్భంగా చర్చలు జరిగినట్లు సమాచారం.

బీజింగ్‌లో జరిగిన ఈ భేటీలో వాణిజ్యం, భద్రత, అంతర్జాతీయ సంబంధాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఇరు దేశాధినేతలు చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం ద్వైపాక్షిక చర్చలు కొనసాగినట్లు అధికారులు తెలిపారు.

తైవాన్ సమస్యను సరిగ్గా పరిష్కరించకపోతే అమెరికా-చైనా మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని జిన్‌పింగ్ హెచ్చరించినట్లు సమాచారం. ఈ అంశంపై చైనా తన వైఖరిని స్పష్టంగా వెల్లడించినట్లు అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
