Fatal accident | ఇద్దరు మృతి..
Fatal accident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. కూరగాయల లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వైపు కూరగాయల లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం అకస్మాత్తుగా అదుపుతప్పింది. డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాద తీవ్రతకు బొలెరో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
