48hours | అక్కడ రెండు రోజుల పాటు వర్షాలు, ఈదురు గాలులు

48hours | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : నైరుతి బంగాళాఖాతం-పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

సముద్ర మట్టానికి సుమారు 5.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు కదులుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ నెల 16 నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ నికోబార్‌ దీవుల ప్రాంతాలను రుతుపవనాలు తాకే అవకాశముందని వెల్లడించారు. రైతులు, మత్స్యకారులు వాతావరణ సూచనలు గమనించాలని సూచించారు.

Leave a Reply