​మెడిసిటిలో ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం….

​మెడిసిటిలో ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం….

​మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ మండలంలోని ఘన్‌పూర్ పరిధిలోని మెడిసిటి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (MIMS) లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం వేడుకలు ఘనంగా జరిగాయి. గత వారం రోజులుగా నర్సులకు నిర్వహించిన వివిధ క్రీడా, సాంస్కృతిక పోటీల ముగింపు కార్యక్రమాన్ని నేడు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మెడిసిటి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఈఓ ఐనిష్ మర్చంట్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ గీత మాట్లాడుతూ నర్సింగ్ వృత్తిలోని గొప్పతనాన్ని కొనియాడారు.

​వైద్య రంగంలో చికిత్స కంటే 90 శాతం సేవలు నర్సుల ద్వారానే అందుతాయి. రోగి ఆస్పత్రిలో చేరినప్పటి నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు నర్సులు అందించే సేవలు మరువలేనివి. రోగుల పట్ల కరుణతో వ్యవహరించాలి” అని సూచించారు. ​ఐనిష్ మర్చంట్ మాట్లాడుతూ.. నర్సులు చూపే ప్రేమాభిమానాలు రోగులు త్వరగా కోలుకోవడానికి ఔషధంలా పనిచేస్తాయని, చాలా సందర్భాల్లో రోగులు నర్సులను తమ సొంత బిడ్డల్లా భావించే స్థాయికి వారి సేవలు ఉంటాయని పేర్కొన్నారు. ​కార్యక్రమం ప్రారంభంలో నర్సింగ్ సిబ్బంది ప్రదర్శించిన స్వాగత నృత్యం ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన సిబ్బందికి అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఈ వేడుకల్లో MIMS ప్రిన్సిపల్ దేవేంద్ర సింగ్ నేగి, మార్కెటింగ్ మేనేజర్ డాక్టర్ రవికిరణ్, నర్సింగ్ సూపరింటెండెంట్ సుజాత, పారామెడికల్ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply