Medical camp | పల్లార్గూడలో ఉచిత మెగా వైద్య శిబిరం

Medical camp | పల్లార్గూడలో ఉచిత మెగా వైద్య శిబిరం
Medical camp | సంగెం, ఆంధ్రప్రభ : మండలంలోని పల్లార్గూడ గ్రామంలో ఎన్ ఎస్ ఎస్, సీబీఐటీ ఆధ్వర్యంలో తెలంగాణ పోలీస్ అకాడమీ డీసీపీ మధుకర్ స్వామి మార్గనిర్దేశంలో భారీ స్థాయిలో ఉచిత మెగా వైద్య శిబిరం(Medical camp) నిర్వహించబడింది. ఈ వైద్య శిబిరంలో హైదరాబాద్‌కు చెందిన యశోద హాస్పిటల్, అగర్వాల్ హాస్పిటల్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, శ్రీ చక్ర హాస్పిటల్, కూరపాటి లాప్రోస్కోపీ తదితర ప్రముఖ హాస్పిటల్స్‌కు చెందిన అనుభవజ్ఞులైన వైద్య బృందం పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
పల్లార్గూడ, విఆర్ఎల్ తండా, పోచం పోచమ్మ తండా, పరిసర గ్రామాల నుండి సుమారు 600 మంది ప్రజలు పాల్గొని వైద్య సేవలు పొందారు. గ్రామీణ ప్రాంతాల్లో(rural areas) ఉచిత వైద్యంతో పాటు మందులు అందజేసినందుకు నిర్వాహకులకు పలువురు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లార్గూడ గ్రామ సర్పంచ్ గుగులోతు సరోజన, విఆర్ఎన్ తండా సర్పంచ్ గుగులోతు వెన్నెల, పోచమ్మ తండా గ్రామ సర్పంచ్ బానోతు నరసింహ, విధాత స్కూల్ కరస్పాండెంట్ సింగారపు లక్ష్మణ్, పల్లార్గూడ గ్రామ ఉపసర్పంచ్ బొమ్మ కోటేశం, మాజీ ఎంపీపీ కక్కెర్ల సదానందం, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
