బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా డా.వన్నాల వెంకటరమణ
కరీమాబాద్, ఆంధ్రప్రభ ; భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా డా.వన్నాల వెంకటరమణ నియామకం అయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. వెంకటరమణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి ఆయనఆశీర్వాదం తీసుకున్నారు ఈ నియామకం ఈనెల 12 నుండి అమలులోకి వస్తుందని ప్రకటించారు. గతంలో డా.వన్నాల వెంకటరమణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు.
కాగా, తన సేవలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తనకు బాధ్యతను అప్పగించినందుకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావుకి, రాష్ట్ర నాయకులకు, జాతీయ బీజేపీ నాయకత్వానికి వెంకటరమణ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. డా.వన్నాల వెంకట రమణ బాల్యం నుండి స్వయంసేవక్, శ్రీ గురుకుల విద్యాలయం, మహేశ్వరం, నర్సంపేటలో 5వ తరగతి నుండి ఇంటర్ వరకు విద్యనభ్యసించారు.
తన 9-10 వ తరగతి లో ముఖ్య శిష్యక్ గా, హై స్కూల్ రోజుల్లో వర్గల్లో ఆర్‌ఎస్‌ఎస్ శిబిరాలకు హాజరయ్యేవారు. వెంకటరమణ తండ్రి మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు ,బీజేపీ మాజీ జాతీయ కౌన్సిల్ మెంబర్ గా ఉన్నారు. జన సంఘ్ తదనంతరం.వన్నాల వెంకటరమణ వృత్తిరిత్య డాక్టర్. వీరు ఎం.డి.ఎస్, పి.హెచ్.డి దంతవైద్య నిపుణులుగా ప్రొఫెసర్ గా దేశ విదేశాలలో తమదైన విశిష్ట సేవలందించారు.
అంతేకాకుండా డా.వన్నాల వెంకట రమణ ఇరవై ఏళ్లుగా వాక్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.రాష్ట్రంలో, వరంగల్ జిల్లాలోని ప్రజలతో మమేకమై బీజేపీ ప్రతీ కార్యకర్తతో, నాయకులతో కలిసి పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని వెంకటరమణ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
