Jukkal | జుక్కల్ లో ఘనంగా భోగి వేడుకలు

Jukkal | జుక్కల్ లో ఘనంగా భోగి వేడుకలు

  • ఇంటి ముంగిట్లో ఆకర్షిస్తున్న రంగురంగుల ముగ్గులు

Jukkal | జుక్కల్, ఆంధ్రప్రభ : మకర సంక్రాంతి పండుగను జుక్కల్ మండలంలో ప్రజలు భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాలతో నిర్వహిస్తున్నారు. భోగి పండుగను పురస్కరించుకుని చిన్నారులు, ఆడపడుచులు ఉత్సాహంగా పోటాపోటీగా తమ ముంగిట్లో అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మలను ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటి ముంగిట్లో రంగురంగులతో వేసిన ముగ్గులు అందర్నీ ఆకర్షిస్తున్నాయి.

దీంతో పాటు చిన్న, పెద్ద వయస్సు తేడా లేకుండా గాలిపటాలు ఎగురవేయడం, సందడి చేయటం జరుగుతుంది. తీపి వంటకాలు చేసి బంధుమిత్రులకు సయితం ఆహ్వానిస్తున్నారు. ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకోవడం జరుగుతుంది. కర్ణాటక – మహారాష్ట్ర సరిహద్దులో జుక్కల్ ఉండటంతో అక్కడి సంస్కృతి, సాంప్రదాయాలు సైతం జుక్కల్ మండలంలో కన్పిస్తాయి. మకర సంక్రాంతి పండుగ సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టిన పేరు అని పెద్దలు అభివర్ణిస్తుంటారు.

Leave a Reply