ముధోల్ లో ఘనంగా మే డే దినోత్సవం

ముధోల్, ఆంధ్రప్రభ : ముధోల్ మండల కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు గంధం లింగన్న జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో ప్రజా పంపిణీ గోదాం వద్ద 140వ మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మే డే జెండాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ….1886 మే 1న అమెరికాలోని చికాగోలో 8 గంటల పని దినం కోసం కార్మికులు చేసిన ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, ఆ పోరాటాల ఫలితంగానే కార్మిక హక్కులు సాధ్యమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులను దెబ్బతీస్తున్నాయని విమర్శించారు.ఈ కార్యక్రమంలో నాయకులు బొగ్గులు హనుమాన్లు, నాగేష్ వెంకటేష్ , రవి, సాయినాథ్, సంతోష్, సిహెచ్ బాబు, రాములు తదితరులు పాల్గొన్నారు
