రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకండి..

రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకండి..
రాప్తాడు ఆంధ్రప్రభ : రాప్తాడు సర్కిల్ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చట్ట వ్యతిరేక పనులకు తావు లేకుండా పని చేయాలని నూతన సీఐ సి.వెంకటేష్ కు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. రాప్తాడు అఫ్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ గా నియమింపబడిన సీఐ సి.వెంకటేష్ అనంతపురం టిడిపి కార్యాలయం నందు ఎమ్మెల్యే పరిటాల సునీత ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ తో మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు.రాప్తాడు సర్కిల్ పరిధిలోని పలు అంశాల గురించి చర్చించారు.సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలు చాలా ముఖ్యమని అన్నారు.చట్ట వ్యతిరేక పనులకు ఎవరు పాల్పడినా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇందులో మా వైపు నుంచి ఎలాంటి ఒత్తిళ్లు ఉండవని అన్నారు. రాజకీయ పార్టీలకు అస్సలు సంబంధం ఉండదన్నారు. సర్కిల్ లో శాంతిభద్రతలు కాపాడాలన్నారు. కష్టం వస్తే పోలీసులు ఉన్నారనే నమ్మకం కలిగేలా పని చేయాలి అని చెప్పారు. ఎలాంటి సమయంలో అయినా పోలీస్ శాఖకు మా వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.
