అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలంపియాడ్‌లో విద్యార్థుల ప్రభంజనం

అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలంపియాడ్‌లో విద్యార్థుల ప్రభంజనం

దమ్మపేట, ఆంధ్రప్రభ : “అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలంపియాడ్ ” ఫలితాలలో దమ్మపేట బోటని బాలాజి స్కూల్ విద్యార్థులు 23 మంది గోల్డ్ మెడల్స్ సాధించి ప్రభంజనం సృష్టించారు .ఆ పాఠశాల కరస్పాండెంట్ నర్సన్ మంగళవారం విలేకర్లకు తెలిపారు .

ర్యాంకులు సాధించిన విద్యార్థులు టి.ఉదయ్ రాఘవ- 8వ తరగతి(రాష్ట్రస్థాయి ర్యాంకు- 64, జాతీయస్థాయి ర్యాంకు- 434), ఆర్. చర్వాన్- 9వ తరగతి (రాష్ట్రస్థాయి ర్యాంకు-109, జాతీయస్థాయి ర్యాంకు- 969), పి.లోహిత్ – 9వ తరగతి (రాష్ట్రస్థాయి ర్యాంకు- 117, జాతీయ స్థాయి ర్యాంక్- 925), ఎస్. సాయి సుదీక్ష- 6వ తరగతి(రాష్ట్రయ స్థాయి ర్యాంకు-137, జాతీయస్థాయి ర్యాంకు-818), ఏ. జ్యోతి- 7వ తరగతి(రాష్ట్రస్థాయి ర్యాంకు – 279)సాధించగా 350 లోపు 8 మంది విద్యార్థులు.

గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు 23, “జాతీయ స్థాయి ర్యాంక్- 103మంది విద్యార్థులు సాధించి విజయకేతనం ఎగరవేశారు. ఈ సందర్భంగా బోటని బాలాజి విద్యాసంస్థల చైర్మన్ బాలాజి మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ద్వారా ఈ విజయాలను సాధించగలిగాము అన్నారు. కరస్పాండెంట్ నర్సన్, ప్రిన్సిపల్ అనంతరావు, సమన్వయకర్తలు సుధాకర్, నాజియా సుల్తానా, గణిత బోధకురాలు మాధవి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు , గ్రామస్తులు విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.