Welfare Schemes | ఏపీ మాజీ సీఎంని కలిసిన జితేందర్ రెడ్డి…
Welfare Schemes | ఏపీ మాజీ సీఎంని కలిసిన జితేందర్ రెడ్డి…
Welfare Schemes | బూర్గంపాడు, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని భూర్గంపాడు మండల యువ నాయకుడు వీరం రెడ్డి జితేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఆయనతో తెలంగాణ రాష్ట్రం(Telangana State)లోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటికీ తమ అభిమానులు ఉన్నారని దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కా ఉన్న సమయంలో రాష్ట్ర అభివృద్ధిలో సంక్షేమ పథకాలు(Welfare Schemes) అమలు చేసిన తీరుకు రాజన్న కుటుంబానికి ప్రజలు రుణపడి ఉన్నారని గుర్తు చేశారు.
బూర్గంపాడు మండలంలో ఉన్నటువంటి 18 పంచాయితీల్లో వైయస్సార్ అభిమానులు, జగనన్న అభిమానులు ఉన్నారని గుర్తు చేశారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవ్వుతూ భుజం తట్టి జితేందర్ రెడ్డిని పలకరించారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ మంచి రోజులు వస్తాయి అప్పటివరకు చూస్తూ ఉండాలని అన్నారు.
