Film Nagar | డివైడర్ ఢీకొట్టి…

Film Nagar | డివైడర్ ఢీకొట్టి…

Film Nagar | హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. ఇవాళ ఉదయం కారు డివైడర్ ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ ఢీకొట్టడమే కాకుండా.. డివైడర్ పైకి ఎక్కడంతో.. ముందు టైర్ బ్లాస్ట్ అయిపోయింది.

ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారు ప్రమాద సమయంలో ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. యువకుడికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply