March25th | మంగ్లీ–మైక్రో ఫైనాన్స్ వివాదం: ప్రత్యూష రాథోడ్ స్పందన వైరల్

March25th | మంగ్లీ–మైక్రో ఫైనాన్స్ వివాదం: ప్రత్యూష రాథోడ్ స్పందన వైరల్

March25th | సోషల్ మీడియాలో చర్చకు దారితీసిన వివాదం
మంగ్లీతో తన సంబంధంపై ప్రత్యూష క్లారిటీ
నెటిజన్ల ఆరోపణలపై స్పందన
వాస్తవాలు తెలుసుకునే వరకు మౌనం

March25th | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మంగ్లీ–మైక్రో ఫైనాన్స్ అంశంపై తీవ్ర చర్చ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అవుతుండగా, ఈ నేపథ్యంలో ప్రత్యూష రాథోడ్ ఆ విషయంపై ఆంధ్రప్రభతో ప్రత్యేకంగా స్పందించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఆమె మాట్లాడుతూ, మంగ్లీతో తనకు పెద్దగా సన్నిహిత పరిచయం లేదని స్పష్టం చేశారు. ఇతరుల మాదిరిగానే తనకూ ఒకటి లేదా రెండు సంవత్సరాల క్రితమే పరిచయం ఏర్పడిందని చెప్పారు. ఈ మొత్తం కాలంలో రెండు లేదా మూడు సార్లు మాత్రమే మాట్లాడుకున్నామని, అది కూడా ప్రత్యేక అవసరాల సందర్భాల్లోనే జరిగిందని తెలిపారు.

చివరిసారిగా ఈ ఏడాది మార్చి 25న ఒక స్టేటస్‌కు సంబంధించిన విషయంపై మాట్లాడినట్లు పేర్కొన్నారు. అంతకుముందు కూడా పెద్దగా వ్యక్తిగత సంబంధం లేదని, సాధారణ పరిచయం మాత్రమే ఉందని వివరించారు.

March25th

మొదట్లో మంగ్లీపై తనకు అనుకూల అభిప్రాయం ఉండేదని ప్రత్యూష వెల్లడించారు. ఆమె పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సహానుభూతితో చూసినట్లు చెప్పారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఆమె వీడియోల కింద పలువురు నెటిజన్లు చేసిన కామెంట్లు తన దృష్టికి వచ్చాయని తెలిపారు.

“మా డబ్బులు తీసుకున్నారు”, “మేము వ్యక్తిగతంగా నష్టపోయాం”, “మాకు న్యాయం జరగాలి” వంటి వ్యాఖ్యలు వరుసగా కనిపించడంతో ఈ వ్యవహారాన్ని మరింత గంభీరంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని భావించినట్లు చెప్పారు.

ఈ అంశంపై పలువురు మీడియా ప్రతినిధులు స్పందించాలని కోరినా, వెంటనే స్పందించడం సరైంది కాదని భావించానన్నారు. ముందుగా కొన్ని రోజులు పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని, వాస్తవాలు తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని ప్రత్యూష రాథోడ్ స్పష్టం చేశారు.

ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మంగ్లీ–మైక్రో ఫైనాన్స్ వ్యవహారం ఎటువంటి మలుపు తిరుగుతుందో అన్నది ఇప్పుడు అందరిలోనూ హాట్ టాపిక్గా మారింది.

ప్రత్యూష రాథోడ్ వెల్లడించిన మరిన్ని ఆసక్తికర విశేషాలు, పూర్తి వివరాల కోసం పూర్తి ఇంటర్వ్యూను తప్పక వీక్షించండి. ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేయండి.

Leave a Reply