30thaprileditorial | బెంగాల్‌ పై దేశం దృష్టి

30thaprileditorial | బెంగాల్‌ పై దేశం దృష్టి

30thaprileditorial | బెంగాల్‌లో హోరాహోరీ అంచనాలు
తమిళనాడు, అసోం, కేరళలో స్పష్టమైన ట్రెండ్
బీజేపీ vs తృణమూల్ పోటీ తీవ్రత
విజయ్ పార్టీపై ఆసక్తికర అంచనాలు
కేరళలో యూడీఎఫ్‌కు అవకాశాలు
పుదుచ్చేరిలో ఎన్డీఏకు అనుకూల సంకేతాలు

30thaprileditorial | దేశం దృష్టిని ఆకర్షించిన పశ్చిమ బెంగాల్‌లో రెండవ దశ పోలింగ్ బుధవారం ముగియడంతో ఐదు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. బెంగాల్‌లో ప్రచారంలోనే కాకుండా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లోనూ హోరాహోరీ పోటీ కనిపించింది. తమిళనాడు, కేరళ, అసోంలలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్పష్టంగా ఉన్నాయి. తమిళనాడులో డీఎంకే, అసోంలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవచ్చని స్పష్టం చేస్తున్నాయి. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఈసారి విజయం సాధించవచ్చని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సూచిస్తున్నాయి.

బెంగాల్‌లో రెండవ దశ పోలింగ్ 92 శాతం నమోదు అయింది. బెంగాల్‌లో ఈసారి బీజేపీ అధికారంలోకి రావచ్చని పలు సంస్థలు అంచనా వేశాయి. చాణక్య స్ట్రాటజీ మ్యాట్రిక్స్, ప్రజామత్ వంటి సంస్థలు బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. అయితే, మరికొన్ని సంస్థలు తృణమూల్‌కే ఓటేశాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ తమ పార్టీ నాల్గవసారి అధికారంలోకి వస్తుందని, మూడింట రెండు వంతుల మెజారిటీని సాధిస్తుందని ధీమాగా చెబుతున్నారు. ఈ పోలింగ్ సందర్భంగా అక్కడక్కడ హింస చోటు చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి.

అసోంలో తమ పార్టీ మూడోసారి అధికారాన్ని సాధిస్తుందని బీజేపీ నాయకుడు, ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా ప్రకటించారు. అక్కడ బీజేపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ముందే ప్రకటించాయి. తమిళనాడులో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో నిమిత్తం లేకుండా, తమ పార్టీ మొదటి సారి ఎన్నికల్లోనే 140 స్థానాలు గెల్చుకోగలదని సినీనటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రతినిధి ధీమాగా ప్రకటించారు. ఎన్‌టీవీ యాక్సిస్ విజయ్ పార్టీకి 120 స్థానాలు రావచ్చని అంచనా వేసింది.

రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. డీఎంకే కూటమికి 92-110 మధ్య సీట్లు, అన్నా డీఎంకేకు 22-32 మధ్య సీట్లు రావచ్చని అంచనా వేసింది. ఇదే నిజమైతే, దశాబ్దాలుగా అధికారంలో కొనసాగుతున్న ఉభయ డీఎంకెలను పక్కకు తోసి కొత్తగా పార్టీ పెట్టిన సూపర్ స్టార్ విజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. విజయ్ పార్టీకి 98 స్థానాలు వచ్చినా కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

కేరళలో ఈసారి యూడీఎఫ్‌కు అవకాశం లభించవచ్చని, అయితే మార్క్సిస్టు ఫ్రంట్ కూడా గట్టిపోటీ ఇచ్చిందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సూచిస్తున్నాయి. చాలా సర్వేలు యూడీఎఫ్ అధికారంలోకి రావచ్చని అంచనా వేశాయి. బెంగాల్‌లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు హోరాహోరీగా ఉన్నాయి. నాల్గవసారి అధికారానికి ప్రయత్నిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ ఎన్టీవీ ఎగ్జిట్ పోల్స్‌లో 156 స్థానాలు గెల్చుకోవచ్చని అంచనా వేసింది. మిగిలిన సంస్థల్లో మూడుపైగా బీజేపీకి ఎక్కువ స్థానాలు వస్తాయని అంచనా వేశాయి.

మొదటి దశ పోలింగ్ కాగానే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగాల్‌లో అధికారాన్ని సాధిస్తామని ప్రకటించారు. స్వీట్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని బీజేపీ శ్రేణులను ఆదేశించారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ఎన్టీవీ ఎగ్జిట్ పోల్స్ పేర్కొంది.

Leave a Reply