ORR Exit 16 | లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు మృతి

ORR Exit 16 | లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు మృతి

ORR Exit 16 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని శంషాబాద్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు.

ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తీవ్రతకు కారు పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply