KNR | బొమ్మకల్‌లో వ్యక్తి దారుణ హత్య..
కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : అక్రమ సంబంధాన్ని బయటపెట్టినందుకు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన కరీంనగర్ జిల్లా బొమ్మకల్ లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
బొమ్మకల్ గ్రామానికి చెందిన బెజ్జంకి మహేష్ ను.. అదే గ్రామానికి చెందిన కాల్వ సతీష్ బీరు బాటిల్ పగలగొట్టి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు.
సమాచారం అందుకున్న కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కుమార్… ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మహేష్ అక్రమ సంబంధాన్ని బయటపెట్టాడనే కారణంతో సతీష్ హత్య చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.