CCL 2025 | తెలుగు వారియర్స్ టీమ్ జెర్సీ ఆవిష్కరణ..
- ఈనెల 8 నుంచి సెలబ్రిటీ క్రికెట్ లీగ్..
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) కొత్త సీజన్‌తో త్వరలో ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌లో టాలీవుడ్ సినీ తారల తెలుగు వారియర్స్ టీమ్ జెర్సీ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ జట్టు కెప్టెన్.. హీరో అఖిల్‌తో పాటు తమన్, ఆది, అశ్విన్, రఘు, సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు.
కాగా ఈ కార్యక్రమంలో అఖిల్ మాట్లాడుతూ.. ‘సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఐడియా గురించి చెప్పినప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా? లేదా? అనేది ఎవరికీ తెలియదు. కానీ, ఇప్పుడు మనం 11వ సీజన్‌లోకి అడుగుపెట్టాం. మేము ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చి నిలబడ్డాం. ఇప్పటివరకూ మేము నాలుగుసార్లు గెలిచాం. ఐదోసారి కూడా కప్పు కొట్టాలనుకుంటున్నాం. ఆటతో పాటు అందరినీ ఎంటర్‌టైన్ చేయాలనుకుంటుంన్నాం. మేము ఎంతో అభిరుచితో ఆడుతున్నాం. ఉప్పల్ స్టేడియంలో ఫిబ్రవరి 14, 15న మ్యాచ్ ఆడుతున్నాం. అక్కడికి రండి మమ్మల్ని ప్రోత్సహించండి’’ అని అఖిల్ చెప్పుకొచ్చారు.