త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

  • అదుపుతప్పి కూలింగ్ కెనాల్ రెయిలింగ్ ను ఢీకొన్న బస్సు
  • 38 మంది ప్రయాణికులు సురక్షితం

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: ఎన్టీఆర్ జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న సితార ట్రావెల్స్ బస్సు మంగళవారం తెల్లవారుజామున అదుపు తప్పి ఇబ్రహీంపట్నంలోని కూలింగ్ కెనాల్ రెయిలింగ్ ను ఢీకొంది.

బస్సు ఎడమ వైపు ముందుభాగం గాల్లో తేలింది. బస్సు కూలింగ్ కెనాల్ లో పడి ఉంటే ప్రాణనష్టం భారీగా జరిగేది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనతో బస్సులో ఉన్న 38 మంది ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. హైవే సిబ్బంది, ఇబ్రహీంపట్నం పోలీసులు చాకచక్యంగా ప్రయాణికులను కిందకు దింపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.