విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు..

విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు..

కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరంలోని ఎంఎం నగర్ దూపకుంట ప్రాంతంలో స్థల వివాదంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన వరంగల్ మిల్స్ కాలని(Warangal Mills Kalani) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇంటి నిర్మాణం విషయంలో రెండు కుటుంబాలు ఘర్షణ పడటం వల్ల బాధితులు గాయపడ్డారు. వివాదం కాస్తా ఘర్షణకు దారి తీసింది. సంధ్య అనే మహిళ కుటుంబ సభ్యులపై మరో వర్గం దాడి చేశారని సమాచారం.

ఈ రోజు ఉదయం బాధితురాలి ఇంటి వద్ద ఘటన జరిగిందని పోలీసుల స‌మాచారం. దాడికి పాల్పడ్డవారిలో స్థానికేతరులు ఉన్నారని బాధితులు ఆరోపించారు(alleged victims). గాయపడిన వారు మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మిల్స్ కాలనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సమాచారం సేకరించారు. ఘర్షణకు పాల్పడిన బాధితులు రాజు, సంధ్య(Raju, Sandhya) అని ఇరువురు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.

Leave a Reply