Lorry Driver | ఇది మద్యం మత్తు.. విపత్తు

Lorry Driver | ఇది మద్యం మత్తు.. విపత్తు
Lorry Driver | మంచిర్యాల ప్రతినిధి – ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రానికి సమీపంలో ఈ రోజు మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ గొర్రెల మంద పై నుండి లారీ వేగంగా నడిపాడు. దీంతో 20 గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. మేడారం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు వద్ద గొర్లను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గొర్రెల కాపరి జరిగిన ఆర్థిక నష్టానికి బావురుమన్నాడు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.
