ఎస్ఐఆర్ సర్వే వేగవంతం చేయాలి: చైర్మన్

జైనూర్, ఆంధ్రప్రభ : ఎస్ ఐ ఆర్ సర్వే ను వేగవంతం చేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథరావు తాహసిల్దార్ ఆడ బీర్షావ్ కోరారు. కొమురం భీమా శివబా జిల్లా జైనూర్ మండల కేంద్రంలో మేజర్ గ్రామపంచాయతీ ఓటర్ల కోసం మార్కెట్ కమిటీ యాడ్ లో ప్రత్యేక ఎస్ఐఆర్ సర్వే క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో జైనర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెట్ విశ్వనాథ్ రావు , జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్ పాల్గొని ప్రత్యేక సర్వే క్యాంపును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ఓటర్లు త్వరగా పూర్తి వివరాలతో ఎస్ఐఆర్ సర్వే పారాలను నింపి బిఎల్ఓ లకు అందించాలని , నింపిన సర్వే ఫారాలనుఆన్లైన్ చేయించాలని కోరారు.

ఎస్ ఐ ఆర్ సర్వే ప్రాముఖ్యత గురించి క్యాంపులో పాల్గొన్న ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జై నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కో డప ప్రకాష్, ఆర్ఐ మోహన్, జై నూర్ మేజర్ గ్రామపంచాయతీ ఇన్చార్జీ ఈవో ఆనందరావు, సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షులు మడవి భీమ్రావు, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు కుమ్ర భగవంతరావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంతియాజ్ లాల,కాంగ్రెస్, బి ఆర్ ఎస్ యువ నాయకులు మెస్రం అంబాజీరావు, ముండే సతీష్, వార్డ్ సభ్యులు పూర్క బాపూరావు, వివిధ పార్టీల నాయకులు ఆదివాసి సంఘ నాయకులు ,పంచాయతీ కార్యదర్శులు, బిఎల్వోలు, ప్రజలు పాల్గొన్నారు.