Shivani-Death : చ‌లాకీ శివానీ ఇక‌లేదు Andhra Prabha Sad News

Shivani-Death : చ‌లాకీ శివానీ ఇక‌లేదు Andhra Prabha Sad News

  • అనూహ్యంగా బ‌డిలోనే ఆత్మ‌హ‌త్య‌
  • చ‌లించిన సీఎం చంద్ర‌బాబు
  • మూడు రోజుల కింద‌టే..
  • సీఎంతో క‌ల‌సి భోజ‌నం.. మాటామంతీ
  • ఏపీలో తీవ్ర విషాదం

( రంపచోడవరం, ఆంధ్రప్రభ )

పోలవరం జిల్లా రంపచోడవరం మండలం ఇర్లపల్లిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ఈ స‌మాచారంతో యావ‌త్తు ఆంధ్రాప్ర‌జానీకం విషాదంలో మునిగిపోయింది. ఇక సీఎం చంద్ర‌బాబు చ‌లించిపోయారు. ఆమె బ‌ల‌వ‌న్మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక పోయారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర ద‌ర్యాప్తున‌కు ఆదేశించారు. మూడు రోజుల కిందటే రంపచోడవరం జిల్లా పరిషత్ హై స్కూల్ లో జరిగిన సీఎం చంద్రబాబు నాయుడు తల్లికి వందనం కార్యక్రమంలో చురుగ్గా క‌నిపించింది. సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి భోజనం చేసింది. చంద్రబాబు నాయుడుతో షైనింగ్ స్టార్ అవుతానని ,అవార్డును సీఎం చేతులతోనే తీసుకుంటాను అంటూ సీఎంకు శివాని హామీ ఇచ్చింది. విద్యార్థిని మాటలకు పరవశించిన చంద్రబాబు నాయుడు సెల్ఫీ దిగి రాబోయే రోజుల్లో తనకు రిపోర్ట్ చేయాలంటూ విద్యార్థినితో సీఎం తెలిపినట్లు సమాచారం ..చురుగ్గా ఉన్న విద్యార్థిని శివాని ఒక్కసారిగా ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో త‌ల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఘటనా స్థలానికి రంపచోడవరం పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Shivani-Death : చ‌లించిన సీఎం

పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని తనువు చాలించడం నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని బలవన్మరణం ఆవేదన కలిగించింది. ఆ రోజు తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి శివాని నాతో చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఎంతో భవిష్యత్ ఉన్న గిరిజన బిడ్డ ఇలా తనువు చాలించడం బాధాకరం. కారణాలు ఏవైనా తన కలలు నిజం కాకుండానే ఆ విద్యార్ధిని దూరమవ్వడం నన్ను కలిచివేస్తోంది. శివాని మృతిపై పూర్తి దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించాను.

ఎShivani-Death : న్ని క‌ష్టాలొచ్చినా…

సమస్యలు, కష్టాలు వచ్చినా విద్యార్థులు, యువత ధైర్యంగా నిలబడాలి. ఎవ్వరూ ఒత్తిడికి, నిరాశ, నిస్పృహలకులోను కావొద్దని కోరుతున్నాను. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. మీ బాధను, ఆవేదనను మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఆత్మీయులతో పంచుకోండి. ఒత్తిడిని, అధిగమించి మీ కలలను నిజం చేసుకునేలా ముందుకు సాగండి. ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాము.