AP | అదే.. ప్రభుత్వ ఆశయం..

AP | అదే.. ప్రభుత్వ ఆశయం..

AP, చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : రైతన్న మీ కోసం.. సర్వే కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేయాలి అని జిల్లా కలెక్టర్ (Collector) సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం క్యాంపు కార్యాలయం నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా మూడవ రోజు రైతన్న మీకోసం అనే కార్యక్రమం ద్వారా రైతుల సర్వే జరుగుతుందని జిల్లా అధికారులు, డివిజన్ అధికారులు, మండల అధికారులు, ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న 2.50 లక్షల మంది రైతుల ఇళ్లకు వెళ్లి కల్టివేటర్ యాప్ లో రైతుకు ఎంత పొలం ఉంది..? ఏ పంట వేస్తున్నారు..? దిగుబడులు ఎలా వస్తున్నాయి..? రైతుకు ఏ విధమైన అవసరం ఉంది..? తదితర వివరాలను నమోదు చేయాలన్నారు.

ఈ టీమ్ లు ఇంటింటికీ వెళ్లి జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. ఎం.పి.డిఓలు, తహశీల్దార్లు, మండల వ్యవసాయాధికారులు క్లస్టర్ వారీగా సచివాలయ సిబ్బందిని ప్రతి గ్రామానికి నియమించాలని ఆదేశించారు. రైతుల ముఖంలో చిరునవ్వు చూడాలన్నది ప్రభుత్వ ఆశయమని.. దానికి అనుగుణంగా మనమందరం పని చేయాలని తెలిపారు. అన్నదాత సుఖీభవ, రాయితీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు, రైతులకు సంబంధించిన ఆప్ లో అప్లోడ్ చేయాలన్నారు. చిత్తూరు జిల్లాకు 2 లక్షల 2 వేల టార్గెట్ ఉందని వాటిని మనం రీచ్ అవ్వాలన్నారు.

రైతుల ఇంటికి వెళ్లి డోర్ టు డోర్ సర్వే చేయాలని సంబంధిత మండల అగ్రికల్చర్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుత సీజన్లో రైతులకు పెట్టుబడిగా అన్నదాత సుఖీభవ ద్వారా నగదు జమ అయిందా లేదా అని సర్వే చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడి అగ్రికల్చర్, జెడి హార్టికల్చర్, జెడి సీరికల్చర్, ఏడి మార్కెటింగ్, జెడి వెటర్నరీ అన్ని మండలాల తాహసిల్దార్లు, ఎంపిడిఓ లు, ఎన్ హెచ్ ఓ లు, మండల అగ్రికల్చర్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.