ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియ వెంట వెంటనే పూర్తి చేయాలి..

ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియ వెంట వెంటనే పూర్తి చేయాలి..

-జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశం

లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: జిల్లాలో ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా, నిరంతరాయంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.

మంగళవారం లక్ష్మణచాంద మండలంలోని తిరుపల్లి గ్రామ గోదామును ఆయన సందర్శించి, ట్రాక్టర్ల ద్వారా జరుగుతున్న వరి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను వెంట వెంటనే పూర్తి చేయాలని సూచించారు.

గోదాం మొత్తం నిల్వ సామర్థ్యం, ఇప్పటివరకు నిల్వ చేసిన ధాన్యం పరిమాణం, అన్లోడింగ్ కోసం వేచి ఉన్న ట్రాక్టర్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న హమాలీల సంఖ్యపై ఆరా తీసి, అవసరమైతే మరింత మంది హమాలీలను నియమించి అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. హమాలీలకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని సూచించారు.

ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, పౌరసరఫరాల శాఖ అధికారులు రాజేందర్, సుధాకర్, తహసీల్దార్ సరిత, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply