Dandepalli | పూజారి కుటుంబానికి ఆర్థిక సహాయం…

Dandepalli | పూజారి కుటుంబానికి ఆర్థిక సహాయం…
Dandepalli | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం ద్వారక గోదావరి తీరాన గల దత్తాత్రేయ ఆలయ అర్చకుడు మధ్యప్రదేశ్ కు చెందిన హనుమాన్ మిశ్రా, రామ్ లీలా మిశ్రా దంపతుల కుమారునికి మధ్యప్రదేశ్ లో ప్రమాదానికి గురికాగా గ్రామస్థులు తమ వంతుగా రూ.25 వేల ఆర్ధిక సహాయం అందించారు. వీరిది అత్యంత నిరు పేద బ్రహ్మణ కుటుంబం కావడంతో గ్రామస్థులు 25 వేలు ప్రోగు చేసి ఆర్జీపిఎర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, సర్పంచ్ మురిమడుగుల సత్యనారాయణ, గ్రామస్థులతో కలిసి పూజారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పడిగెల శంకర్ రావు, ఉప సర్పంచ్ కస్తూరి హారిక వెంకటేష్, నాయకులు చెరుకు శ్రీనివాస్, తోట శంకర్, రాస అశోక్, ప్రవీణ్ కుమార్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిరికొండ నవీన్, రాయల్ వినాయక యూత్ సభ్యులు పాల్గొన్నారు.
