గంజాయి వ్యసనానికి చికిత్స సాధ్యమే
పునరావాస కేంద్రాలతో సాధారణ జీవితంలోకి యువకుడు
గుడిహత్నూర్, ఆంధ్రప్రభ : గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వ్యసనాలకు గురైన వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడంలో పునరావాస కేంద్రాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని గుడిహత్నూర్ ఎస్హెచ్ఓ ఎల్. శ్రీకాంత్ తెలిపారు. గుడిహత్నూర్ మండలంలోని ముత్తునూరు తండాకు చెందిన ఓ యువకుడు పోలీసుల చొరవతో పునరావాస కేంద్రంలో చికిత్స పొందగా, ప్రస్తుతం వ్యసనాన్ని పూర్తిగా విడిచిపెట్టి కుటుంబ సభ్యులతో కలిసి సాధారణ జీవనం గడుపుతున్నాడు.
సరైన సమయంలో చికిత్స, కౌన్సెలింగ్ అందితే వ్యసనాల నుంచి బయటపడటం సాధ్యమేనని, డ్రగ్స్ బారిన పడిన వారిని పునరావాస కేంద్రాలకు చేర్పించేందుకు కుటుంబ సభ్యులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్హెచ్ఓ సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
