Ap Cm Serious : గొడ్డలి పార్టీ నెవర్​ ఎగైన్​ Andhra Prabha Top Story

Ap Cm Serious : గొడ్డలి పార్టీ నెవర్​ ఎగైన్​ Andhra Prabha Top Story

  • ఇక్కడ సీబీఎన్​ వచ్చాడు
  • తోక జాడిస్తే.. తాటా తీస్తాం
  • అరాచక పాలన మళ్లీ రావొద్దు..!
  • యువత భవిష్యత్తు నాశనం చేశారు..!
  • ప్రజలను మోసం చేసే రాజకీయాలకు ముగింపు..!
  • అభివృద్ధే మా అజెండా ..!
  • కండ్రిగలో సీబీఎన్​ గర్జన
  • పూరించిన స్థానిక శంఖారావం

( చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో):

Ap Cm Serious

ఏపీ సీఎం సీబీఎన్​ స్థానిక ఎన్నికల శంఖారావం పూరించారు. చిత్తూరు జిల్ల పూతలపట్టు నియోజకవర్గంలోని కండ్రిక గ్రామంలో ప్రజావేదిక సాక్షిగా.. సీఎం చంద్రబాబు నాయుడు గొడ్టలి పార్టీపై గర్జించారు. అభివృద్ధి, సంక్షేమం. సుపరిపాలనలో ఎన్డీయే పార్టీ ఒక వైపు.. నేర స్వభావంతో గొడ్డలి పార్టీ మరోవైపు ఉన్నాయన్నారు. గొడ్డలి పార్టీ ఈ రాష్ట్రానికి శాపంగా మారిందని, ప్రజల భవిష్యత్తును నాశనం చేసిన పాలనను ఎప్పటికీ మరిచిపోలేమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని యాదమరి మండలం కండ్రిగలో జరిగిన సభలో మాజీ సీఎం వైఎస్ జగన్​ మోహన్ రెడ్డి పేరు పలకకుండా ఆయన నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తమ ప్రభుత్వం కష్టపడుతుంటే, గతంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని చంద్రబాబు అన్నారు. మేము రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఉద్యోగాలు సృష్టిస్తున్నాం. యువత భవిష్యత్తు కోసం పని చేస్తున్నాం. కానీ గొడ్డలి పార్టీ పాలనలో రాష్ట్రం భయాందోళనల మధ్య నడిచింది. పెట్టుబడిదారులు రావడానికి భయపడ్డారు. పరిశ్రమలు పారిపోయాయి. యువత నిరాశలోకి నెట్టబడ్డారు అని విమర్శించారు. కేవలం 23 నెలల కాలంలోనే తమ ప్రభుత్వం రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చిందని సీఎం తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా 23 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. పెట్టుబడులు వస్తే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే కుటుంబాలు నిలబడతాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఇదే అభివృద్ధి. కానీ గొడ్డలి పార్టీకి అభివృద్ధి అంటే అసహనం అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రతిష్ట పూర్తిగా దెబ్బతిన్నదని చంద్రబాబు విమర్శించారు.

Ap Cm Serious : అప్పుల కుప్ప చేశారు

Ap Cm Serious

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, బెదిరింపులు మాత్రమే కనిపించాయి. ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు. అధికారాన్ని ప్రజాసేవ కోసం కాదు, ప్రతీకారం కోసం ఉపయోగించారు అని మండిపడ్డారు. తన అరెస్టును ప్రస్తావిస్తూ చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నోటీసు ఇవ్వకుండా మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసి జైలుకు పంపడం దేశ చరిత్రలోనే దారుణమైన ఘటన. నన్ను అవమానిస్తే ప్రజలు భయపడతారని భావించారు. కానీ ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రజలు నిజం గుర్తించారు అని అన్నారు. రాజకీయ కక్షసాధింపుల కోసం అధికార వ్యవస్థలను వాడుకున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టారు. భయపెట్టి పాలించాలని చూశారు. మాట్లాడితే కేసులు, ప్రశ్నిస్తే అరెస్టులు అనే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది ప్రజాస్వామ్యమా? లేక నియంతృత్వమా? అంటూ సీఎం ప్రశ్నించారు.

Ap Cm Serious : దళితులను వదల్లేదు

రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా దెబ్బతీశారని విమర్శించారు. దళితులపై జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. దళితులకు రక్షణ ఇవ్వాల్సిన ప్రభుత్వం వారిపైనే కక్షసాధింపులకు దిగింది. ఒక దళిత డ్రైవర్‌ను హత్య చేసిన వారిని సన్మానించడం ఎంత దారుణమో ప్రజలే ఆలోచించాలి. దళితుల గౌరవాన్ని కాపాడాల్సింది పోయి వారిని అవమానించే పరిస్థితి తీసుకొచ్చారు అని మండిపడ్డారు. ఒక దళిత డాక్టర్‌పై వ్యక్తిగత కక్షతో వ్యవహరించిన ఘటనలను కూడా సీఎం ప్రస్తావించారు. సేవా భావంతో పనిచేసే డాక్టర్లను కూడా వేధించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరికైనా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారుచ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ap Cm Serious : అది అరాచక పాలన

Ap Cm Serious

ఇది ప్రజాస్వామ్య పాలన కాదు. ఇది అరాచక పాలన అని విమర్శించారు. రాష్ట్రంలో భయభ్రాంతుల వాతావరణం సృష్టించారని చంద్రబాబు ఆరోపించారు. వ్యాపారులు భయపడ్డారు. అధికారులు భయపడ్డారు. సాధారణ ప్రజలు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. రాష్ట్రం మొత్తం ఒక రకమైన ఒత్తిడిలో నడిచింది. ప్రజల ఆస్తులు, ప్రాణాలకు భద్రత లేకుండా చేశారు అని వ్యాఖ్యానించారు. గొడ్డలి పార్టీ పాలనలో యువత భవిష్యత్తు దెబ్బతిందని సీఎం అన్నారు. ఉద్యోగాలు లేక యువత ఇబ్బందులు పడ్డారు. కంపెనీలు వెళ్లిపోయాయి. నిరుద్యోగులు ఆశలు కోల్పోయారు. అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

Ap Cm Serious : గొడ్డలి పార్టీ నెవర్​ ఎగైన్​..

Ap Cm Serious

ఇప్పుడు సీబీఎన్​ ఉన్నాడు. ఇక తోక జాడింపు కుదరదు. తాట తీస్తాం. గొడ్లలి పార్టీ నెవర్​ ఎగైన్​.. ఇప్పుడు మేము రాష్ట్రాన్ని తిరిగి నిలబెడుతున్నాం. ప్రపంచ స్థాయి పెట్టుబడులు తీసుకొస్తున్నాం. యువతకు ఉపాధి కల్పిస్తున్నాం అని వివరించారు. మేము పని చేస్తే వారు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రం ముందుకు వెళ్లకూడదన్నదే వారి ఆలోచనగా కనిపిస్తోంది అని చంద్రబాబు విమర్శించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Ap Cm Serious : అప్రమత్తత అవసరం

Ap Cm Serious

ప్రజలను మోసం చేసే రాజకీయాలకు ముగింపు పలకాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేసే నాయకత్వాన్ని ప్రజలు ఆదరించాలి. మళ్లీ అరాచక పాలన వస్తే రాష్ట్రం మరింత వెనుకబడిపోతుంది అని హెచ్చరించారు. అభివృద్ధి, ఉపాధి, సంక్షేమం, శాంతి భద్రతలు కావాలంటే ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దాలంటే కష్టపడే ప్రభుత్వానికి అండగా నిలవాలి. విధ్వంసం చేసే రాజకీయాలను ప్రజలు తిరస్కరించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది అని సీఎం పిలుపునిచ్చారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర రాజకీయ వేడిని రేకెత్తించాయి. ఆయన ప్రసంగానికి సభకు హాజరైన వారిలో భారీ స్పందన కనిపించింది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ALSO READ : Launches Sanjeevani : త్వరలోనే ఏఐ డాక్టర్​ Andhra Prabha Top News

Leave a Reply