Last match | రుతురాజ్ కీలక ప్రకటన
Last match | రుతురాజ్ కీలక ప్రకటన
Last match | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న కీలక పోరులో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లోనూ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్రసింగ్ ధోనీ తుది జట్టులో లేకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
టాస్ సమయంలోనే ఈ మ్యాచ్‌లో కూడా ధోనీ ఆడటం లేదనే విషయాన్ని కెప్టెన్ రుతురాజ్ స్పష్టం చేశాడు. ప్రస్తుత సీజన్లో చెన్నై హోమ్ గ్రౌండ్ (చేపాక్)లో సీఎస్కేకు ఇదే చివరి మ్యాచ్.
ఈ సీజన్లో చెన్నై వేదికగా జరుగుతున్న చివరి మ్యాచ్ కావడంతో, ఎలాగైనా ‘థాలా’ ధోనీ బరిలోకి దిగుతాడని, తమ ప్రియతమ ఆటగాడిని హోమ్ గ్రౌండ్లో చివరిసారి చూసుకోవచ్చని అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ, ధోనీ తుది జట్టులో లేడనే వార్త తెలియడంతో స్టేడియానికి వచ్చిన ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు.
