10years jail|బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక మలుపు.. మరో కఠిన సెక్షన్ జోడింపు

10years jail|బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక మలుపు.. మరో కఠిన సెక్షన్ జోడింపు
10years jail | భగీరథ్‌పై కేసు తీవ్రత మరింత పెరిగింది
మైనర్ బాలికపై పునరావృత వేధింపుల ఆరోపణలు
కొత్త సెక్షన్‌తో బెయిల్ అవకాశాలపై చర్చ
సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు వేగవంతం
10years jail | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మైనర్ బాలికపై వేధింపుల ఆరోపణలతో నమోదైన ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారగా.. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం భగీరథ్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
ఈ కేసులో ఇప్పటికే పలు తీవ్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా మరో కఠినమైన సెక్షన్‌ను చేర్చినట్లు సమాచారం. బాధిత మైనర్ బాలికపై భగీరథ్ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభించిన నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత (bns) సెక్షన్ 64(2)(m)ను కేసులో చేర్చినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఒకే మైనర్‌పై పునరావృతంగా లైంగిక దాడులకు పాల్పడిన సందర్భాల్లో ఈ సెక్షన్ వర్తిస్తుందని న్యాయ వర్గాలు వివరిస్తున్నాయి.
ఇప్పటికే భగీరథ్‌పై పోక్సో చట్టంలోని నిబంధనలతో పాటు భ్ణ్శ్ 5(L) R/W 6, 74, 75, 11, 12 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తాజాగా చేర్చిన సెక్షన్‌తో కేసు తీవ్రత మరింత పెరిగినట్లు భావిస్తున్నారు.
న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ఆరోపణలు కోర్టులో రుజువైతే కనీసం 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. దీంతో భగీరథ్‌కు తక్షణ బెయిల్ లభించడం కష్టసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండగా, కేసు దర్యాప్తును మరింత లోతుగా కొనసాగించేందుకు భగీరథ్ కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బాధితురాలి మెడికల్ రిపోర్టులు, మొబైల్ డేటా, చాటింగ్ వివరాలు తదితర సాంకేతిక ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించి కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ కేసులో నమోదైన ఆరోపణలు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్నాయని, కోర్టు తుది తీర్పు వెలువడే వరకు నిందితుడిని చట్టపరంగా దోషిగా పరిగణించరాదని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
click here to read పోలీసుల అప్రమత్తతతో భారీ ఫేక్ కరెన్సీ మోసం భగ్నం..
