అలా జరగడానికి కేంద్ర ప్రభుత్వమే కారణం..

అలా జరగడానికి కేంద్ర ప్రభుత్వమే కారణం..
వికారాబాద్, ఆంధ్రప్రభ : చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలన్న చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి లేదని అన్ని పార్టీలతో మాట్లాడి ఏకతాటి పైకి తెచ్చి పార్లమెంట్లో బిల్లు ప్రవేశ పెట్టాల్సి ఉండగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధానం వలనే ప్రతిపక్షాలు దాన్ని వ్యతిరేకించాయని కేంద్ర ప్రభుత్వానికి మహిళా బిల్లు అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేదని మహిళా కాంగ్రెస్ నాయకురాలు దుర్గం సబితా మల్లికార్జున్ గౌడ్ ఆరోపించారు.
ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్లో పూర్తి మెజారిటీ ఉన్న సమయంలో మహిళా బిల్లును అమలు చేయకుండా మెజార్టీ లేని సమయంలో మహిళా బిల్లు పేరుతో పార్లమెంటుకు తీసుకువచ్చారని ఇది ఎంత వరకు సమంజసం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్దోషిగా చూపిస్తూ బీజేపీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తుందని.. ఇది సరైన విధానం కాదని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం అన్ని పక్షాలతో మాట్లాడి పార్లమెంటు ముందుకు ఈ బిల్లు తీసుకురావాలని సూచించారు.
