బ్యాడ్మింటన్‌లో కేయూ ఇంజనీరింగ్‌ విద్యార్థుల ప్రతిభ..

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ఉయ్యూరు ఏజీ అండ్ ఎస్జీఎస్‌ కళాశాలలో రెండు రోజులపాటు నిర్వహించిన కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్‌కళాశాలల బాలుర బ్యాడ్మింటన్‌ పోటీలు బుధవారం సాయంత్రం ముగిశాయి. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ పోటీల్లో కృష్ణా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు తృతీయ స్థానం సాధించి ప్రతిభను చాటుకున్నారు.

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. రాంజీ విజేతలను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డా. ఆర్‌. విజయకుమారి, కళాశాల పీడీ డా. పి. గోపి విద్యార్థులను అభినందించారు.

Leave a Reply