శ్రీశైల దేవస్థానంలో హుండీ లెక్కింపు…
నంద్యాల బ్యూరో : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థానం సంబంధించి శుక్రవారం హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టినట్టు కార్యనిర్వాహణ అధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు.
హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానమునకు 2 కోట్ల 59 లక్షల 68 వేల 400 రూపాయల నగదుతో పాటు 68.200 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కేజీల 170 గ్రాముల వెండి ఆభరణాలు దేవస్థానం హుండీలో పడ్డాయని తెలిపారు. వీటితో పాటు ఫారిన్ కరెన్సీ కి చెందిన యూఎస్ఏ డాలర్లు 590, చైనా యు వాన్స్ 100, సౌదీ అరేబియా రియల్స్ 5, కువైట్ దినార్స్2, కెనడా డాలర్స్ 10, సింగపూర్ డాలర్స్ 14, ఖతార్ రియాల్స్ 1, ఆస్ట్రేలియా డాలర్లు 240, రష్యా రూబెల్స్ 30, యూరోస్ 5, మలేషియా రింగెడ్స్ 23, యూకే ఫౌండ్స్ 45, వంటి వివిధ దేశాల కరెన్సీలు కూడా గుండెల్లో పడ్డాయని తెలిపారు.
ఈ నెల జనవరి 9వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ హుండి లెక్కింపు కార్యక్రమం జరిపామని తెలిపారు. పటిష్టమైన భద్రత ఏర్పాట్లు మధ్య సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు పర్యవేక్షకులు శివ సైనికులతో పాటు పలువురు పాల్గొన్నారు.