కేటీఆర్ వి డైవర్షన్ పాలిటిక్స్..
కేటీఆర్ వి డైవర్షన్ పాలిటిక్స్..
- దమ్ముంటే విచారణ చేయించమను..
- రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
వెల్గటూర్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వి డైవర్షన్ పాలిటిక్స్ అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో రూ. 1600 కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసే బదులు ప్రత్యక్షంగా పరోక్షంగా బీఆర్ఎస్ కు సహకరిస్తున్న బిజెపి ప్రభుత్వంతో విచారణ చేయించమన్నారు. బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకి ప్రజల్లో విశ్వాసం కోల్పోతుందన్నారు. పార్టీని కాపాడుకోవడానికి కేటీఆర్ ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కు పరిమితం కావడం, ఇంట్లో కుటుంబ గొడవల నేపధ్యంలో ఏం చేయాలో తెలియని కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తెలిపారు.
