KTR | సీఎం రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు..

KTR | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణల జోరు పెరిగింది…
మాటలు తూటాలై పేలుతున్నాయి. అధికార-విపక్షాల మధ్య సెటైర్లు ఢాం ఢామ్మని దద్దరిల్లుతున్నాయి.
ఈమధ్య ఒక సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆరెస్ నేత కేటీఆర్ సెటైర్లు కొన్ని కొన్నిగా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
వాటిలో కొన్ని…

ఇంగ్లీష్ రాదు.. తెలుగు రాదు.. హిందీ రాదు.. కేవలం బూతులే వచ్చు… కేవలం బూతుల బాషా… పోనీ తెలుగయినా సక్కగా వస్తాదా..? అంటే అది కూడా సక్కగా రాదు.. బూతులు మాత్రమే వచ్చు…

నువ్వు గట్టిగా “ఏమైంది అయ్యా నాలుగు వేల పెన్షన్‌” అని అడిగితే
“నీ లాగులు, తొండలు ఇడుస్తా….”
“రూ. రెండువేల ఐదొందలు ఏమైందయ్యా” అని అడిగితే
“నీ గుడ్లు పీకీ గోలీలు ఆడుతా…”
“రైతు బందు ఇస్తా అన్నావు కదా ఏమైంది” అని అడిగితే…
“నీ పేగులు తీసి మెడలో ఏసుకుంటా….”

ఇంకో డైలాగ్ నేర్చుకున్నాడు… “పండబెట్టి తొక్కుత” అంటున్నడు…
పండబెట్టి తొక్కుతున్నడు కరెక్టే… కానీ ఎవరిని తొక్కుతున్నడు…?

మొత్తం రియల్ ఎస్టేట్‌ని పండబెట్టిండు… మీ రంగారెడ్డి వాళ్లను తొక్కుతున్నాడు…
ఇది వాస్తవం… రెండేళ్ల నుంచి ఇదే తోక్కుడు తోక్కుతుండు…