Ktr | కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సే

Ktr | కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సే

  • జూబ్లీహిల్స్ ఓట‌ర్ల‌కు కృత‌జ్ఞ‌త‌లు

Ktr | హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఓటరుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr) కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు నందినగర్‌లోని ఆయన నివాసంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. మాగంటి సునీత చివరి వరకు పోరాటం చేశారని కొనియాడారు. పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ద‌న్య‌వాదాలు చెప్పారు.

ఉప ఎన్నికలో(by-election) బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పాయని.. చివరి మూడు రోజుల్లో ఏం జరిగిందో ప్రజలకు తెలుసని అన్నారు. ఈ ఎన్నికతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీనే అనే విషయం స్పష్టమైందన్నారు. రాజకీయాలకు మాగంటి సునీత(Maganti Sunitha) కొత్త అయినప్పటికీ అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చారని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ ఎన్నిక ఎలా జరిగిందో అందరికీ తెలిసిందేనని.. అభ్యర్థి తమ్ముడికే మూడు ఓట్లు ఉన్నాయని గుర్తు చేశారు.