cricket | 159 పరుగులకే కుప్పకూలిన సఫారీ
యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రాకు 5 వికెట్లు
cricket | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన తొలి టెస్టులో భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీ జట్టును టీమిండియా బౌలర్లు ముప్పతిప్పలు పెట్టారు. తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 159 పరుగులుకు కుప్పకూలిపోయింది. టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన సఫారీ బ్యాటర్లను భారత్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. ముఖ్యంగా యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు. ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (31 పరుగులు) టాప్ స్కోరర్. టీమ్ఇండియా బౌలర్లలో బుమ్రా 5 వికెట్లతో సత్తా చాటగా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ చెరో 2, అక్షర్ పటేల్ 1 వికెట్ దక్కించుకున్నారు.


